*
రాజమౌళి కొత్త కారుమీద,మొదటి సారి షికారు బయలుదేరాడు. డ్రైవర్ చాలా ప్రశాంతం గా
నడుపుతున్నాడు కారుని .ఇంతలో రాజమౌళికి ఏదో గుర్తొచ్చి ,ముందున్న డ్రైవర్ భుజం పై
చేత్తో కొట్టి " ఆ వచ్చే షాపు ముందు ఆపవోయ్ " అన్నాడు .
అంతే , స్టీరింగ్ డ్రైవర్ వశం తప్పింది .కారు మెలికలు తిరిగింది .ఓ బస్సు కు కొట్టుకోబోయి
కొద్ది లో తప్పింది .చివరికి ఓ అద్దాల షాపు కు ఒక్క అరడుగు దూరం లో ఆగింది .
ఒక్క రెండు నిమిషాలు , అంతా నిశ్శబ్దం .
రాజమౌళి తేరుకుని , డ్రైవర్ ని అడిగాడు ,
" ఇంతకు ఏం జరిగింది ? "
"మీరు నా భుజం మీద చేత్తో కొట్టారు గదా ? "
"దానికి , కారు కంట్రోల్ తప్పటానికి ఏమిటి సంబంధం ? "
"నిజానికి ఏమీ లేదండీ , కాపోతే ఓ విషయం ఉందండీ "
" ఏమిటి ఆ విషయం ? " అసహనం గా అడిగాడు రాజమౌళి .
" నాకు కారు నడపటం ఇదే మొదటి సారి .ఇంతకు ముందు ఇరవై ఏళ్ళు నేను
ఆస్పత్రులకు శవాలను తీసుకు వెళ్ళే వ్యాను నడిపాను " చెప్పాడు డ్రైవర్
:))
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిబావుంది.
రిప్లయితొలగించండిపాత జోకునే కొత్తగా చెప్పారు..
:)
బాగుంది.
రిప్లయితొలగించండిబావుంది,బావుంది.
రిప్లయితొలగించండిvav
రిప్లయితొలగించండి