*
ఇందుమతి , భర్త మనోజ్ తో అంది ,
"ఈ రోజు తెల్లవారుఝామున ,రేపు వచ్చే నా పుట్టిన రోజుకి మీరు రవ్వల చంద్ర హారం
బహుమతిగా ఇచ్చినట్లు కలొచ్చిందండీ .దీనికి అర్ధం ఏమిటి ? "
"రేపటిదాకా ఓపికపట్టు , నీకే తెలుస్తుంది " నవ్వుతూ ఆమె మొహం లోకి చూస్తూ చెప్పాడు
మనోజ్
సూర్యుడి వయసు ఒక రోజు పెరిగింది . ఇందుమతి పుట్టిన రోజు వచ్చింది
మనోజ్ ప్రేమగా అందంగా ప్యాక్ చేసిన బహుమతి ఆమె చేతిలో పెట్టాడు .ఇందుమతి ఆత్రంగా ,
ఆశగా , ఆనందంగా ప్యాకెట్ తెరిచింది .అందులో ,
అంబటిపూడి వారి "కలలు -వాటి ఫలితాలు " పుస్తకం ఉంది
Hilarious !
రిప్లయితొలగించండిlast punch line to paatu, ee line chala bagundi .. " suryudi vayasu oka roju perigindi" !
చాలా బాగుంది
రిప్లయితొలగించండి