*
అప్పారావు కి దడగా ఉంది .నెలలో చివరివారం. ఎవరన్నా ఓ నాలుగు వ్యాక్యుం క్లీనర్లు కొంటే
చాలు .ఈ నెలకి బతికి పోతాడు .త్వరగా తయారై మార్కెటింగ్ కి బయలుదేరాడు .
భుజంగరావు కాలనీ లో , ఓ ఇంటి తలుపు తెరిచి కనబడింది .తలుపు మీద తట్టి ,
లోపలికి రావచ్చా అని అడిగాడు .సమాధానం వచ్చే లోపే లోపలికి దూసుకెళ్ళాడు
కనిపించిన ఇంటావిడ తో ,
"మేడం , నేను సూపర్ క్లీన్ వ్యాక్యుం క్లీనర్స్ నుండీ వచ్చాను .మీకు డెమో చూపిస్తాను "
అంటూ తన బ్యాగ్ నుండి నాలుగు సుద్దలు పేడ తీసి నేల మీద వేసాడు గట్టిగా .
"చూడండి మేడం , నేను చిన్న మరక కూడా లేకుండా ఈ పేడ క్లీన్ చేస్తాను , నా వ్యాక్యుం
క్లీనర్ తో .అలా చేయలేక పోతే , నేను ఈ పేడంతా తినేస్తాను " ధైర్యం గా చెప్పాడు
" నీకు పచ్చడేమైనా కావాలా ? " అడిగింది మేడం .
" పచ్చడి ఏమిటి మేడం ? "
" నంజుకోవటానికి "
" నంజుకోవటం దేనికి మేడం ,నాకు అర్ధం కావటం లేదు "
" ఎందుకంటే , మేము ఈ ఇల్లు కొత్తగా కట్టుకొని ,పొద్దున్నే గృహప్రవేశ మయ్యాం .
మాకింకా కరంట్ కనక్షన్ పెట్టలేదు "
శ్రీకాంత్ గారూ,
రిప్లయితొలగించండిజోక్ బావుంది :)
ఇది చదవగానే నాకు ష్..గప్ చుప్ సినిమాలో (?) శుభలేఖ సుధాకర్ వాక్యూం క్లీనర్ అమ్మడానికి పడే పాట్లు గుర్తుకొచ్చాయి.
రోజుకో చక్కటి జోకుతో మమ్మల్ని నవ్విస్తున్నందుకు ధన్యవాదాలు.
LOLLLLLLL
రిప్లయితొలగించండిహ హ హా
రిప్లయితొలగించండిహహాహ్హహ్హహహ్హహ్హహహ్హహ్హహ్హహ్హ్ సూపర్
రిప్లయితొలగించండిఅవకాయల సమయం కదా
రిప్లయితొలగించండి:))))) అదిరిందిగా..
రిప్లయితొలగించండి