కోతుల బ్లాగింగ్

"కోతి నుండి మనిషి పుట్టాడు" .డార్విన్ నిజమే చెప్పాడు .లక్షల ఏళ్ల పరిణామం తరువాత కూడా మనలో ఆ మూలాలు మిగిలే ఉన్నాయి .


ఆనగనగా కొన్ని అనామక కోతులు ,


అవి అసూయ అనే కల్లు తాగాయి ,సాటి బ్లాగర్ల కున్న పేరు ప్రఖ్యాతులు వీరి కాళ్ళలో ముళ్ళుగా గుచ్చుకున్నాయి.ఆత్మ స్తుతి , పర నింద అనే
భంగు మనసుకెక్కింది.మెదడుకెక్కింది.చివరిగా అసభ్య పదాలనే నిప్పులపెనం పై కూర్చున్నాయి .


ఇన్ని జరిగిన తరువాత అవి ఉరికే ఉండటం కష్టం.తెలుగు బ్లాగుల వనం లోకి ప్రవేశించాయి.


గోల చేసాయి.భయపెట్టాయి.తూలనాడాయి.తూలి పడ్డాయి.పరిమళ పుష్పాలను కాలి క్రింద చిదిమేశాయి.వేరు వేరు చెట్ల కొమ్మలను రాపాడించి , వాటి మధ్య అగ్గి పుట్టించాయి.అసభ్య పదాలతో దూషించాయి.


ధ్వంస రచన హింసతో................ , మనో హింసతో.................... ,


ఏం చేయాలి మనం ?


నిలిచి పోరాడుదామా,పారిపోదామా ?,


పోనిలే అనుకుందామా , పోరు చేద్దామా ?


మన కలాల గళాలకు ,మన అనుభవాల దొంతరలకు , పంచుకొనే
అనుభూతులకు,పెంచుకొనే జ్ఞానానికి ఇక మనం వీడ్కోలు చెబుదామా?


నా మనసులో మాటగా ,


1.మనందరం కలసి కట్టుగా నిలిచి ,వాటిని పట్టి బంధిద్దాం. సుద్దులు
చెబుదాం.మత్తు వదిలితే సరే , లేకుంటే కట్టడి చేద్దాము.కాదంటే తోకలు కట్ చేద్దాం .


2.వారి చింతలు తీరుద్దాం . ప్రతి కోతికి రెండు చింతలుంటాయి. ఒకటి తనకు లేదని చింత , రెండు పక్క వాడికి ఉందని చింత . వారికి సరైన అవగాహన నిచ్చి చూద్దాం . మారకుంటే మూర్ఖులని దూరమౌదాము వారికి.


౩. ఎవరో తెలీనప్పుడు, అసభ్యపు రాతలు విషమని తెలిసి దూరంగా ఉందాము .ప్రోత్సాహం వల్ల దుర్మార్గం పెరుగు తుంది .


4. ఎవరైనా మనకు ఏదైనా ఇస్తే , మనం కాదంటే , ఆ వస్తువు ఇచ్చిన వారిదే అవుతుంది . కాదనండి కాపురుష వచనాలను.


5.మన ప్రతి వెనకడుగు, వారు ఆక్రమణకు మరో ముందడుగుగా మారుతుంది. ఆ అవకాశం వారికి ఇవ్వద్దు


6. మీ బ్లాగుకు మీరే అన్ని . ఇతరుల అభిప్రాయాలు వినండి . నిర్ణయం మీరు తీసుకోండి .


కోతుల దాడి లో బాధ పడిన ప్రతి ఒక్కరికి ,నా బాసట ఎల్లపుడూ అందించగలనని వినయంగా తెలియజేస్తున్నాను.

4 కామెంట్‌లు:

  1. పనీపాట లేని ఇలాంటి కోతులకి అనవసరమైన అటేన్షన్ ఇచ్చి వాటి ఇమ్పార్టన్స్ పెంచటం ఎందుకు? అరిచి అరిచి వాటి దారిన అవే పోతాయి అని వదిలేస్తే పోలా?
    వాటి గురించి ఆలోచించే కొద్ది మన మనసులు పాడవుతాయి... వదిలేస్తే వాటి దారిన అవే పోతాయి.

    రిప్లయితొలగించండి
  2. ఎంతో కష్టపడి శ్రద్ధగా పెంచుకుంటున్న నందనవనాన్ని ముష్కర మూక వచ్చి సర్వనాశనం చేస్తుంటే చూడటానికి చాలా కష్టంగా ఉంటుంది, కాని తప్పదు మళ్ళా ఆ నందనవనాన్ని పునర్నిర్మించుకోవాలి

    రిప్లయితొలగించండి
  3. శ్రీకాంత్ గారు,

    ఉదయం నుండి మీ టపా కోసం ఎదురు చూశాను మొత్తానికి మీ శైలిలోనే స్పందించి చురకలు వేశారు. ఎవరినీ వ్యక్తిగతం గా నిందించకుండా, గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకునే రీతిలో సరదా మాటల మధ్య సీరియస్‍నెస్ ని తెలియజేశారు.

    కోతుల దాడికి బాధ పడి, కాకుల కూతలకు విసుగెత్తిన ప్రతీ ఒక్కరు తిరిగి బ్లాగటం మొదలు పెట్టి కోయిల స్వరాలను వినిపిస్తారని ఆశిస్తూ.....

    భవదీయుడు,

    సతీష్ కుమార్ యనమండ్ర

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం