*
అడుక్కున్న అర కప్పు హార్లిక్స్ తో రోజు మొదలు పెట్టాడు బిక్షపతి .తను అడుక్కొనే రోడ్డు లోకి అడుగులు వేసాడు వడివడిగా .
ఓ ఇంటి దగ్గర ,
ఆ ఇంటి ఇల్లాలు ,పాలవాడి మీద అరుస్తోంది ,
"పాలేందుకు లేటుగా వచ్చాయి ? "
"ఏం చెప్పనమ్మా ! పంపుల్లో నీళ్లు లేటుగా వచ్చినాయి "
" సరే ,ఏడువు " అంటూ లోపలికి వెళ్ళబోయింది .బిక్షపతి 70 mm dts సౌండ్ లో అరిచాడు ,
" అమ్మా ! ధర్మం చేయి తల్లీ "
ఆమె పరిశీలనగా బిక్ష పతిని చూసింది . ఆప్యాయంగా అడిగింది
"క్రితం వారం కడుపు నిండా అన్నం పెట్టింది నీకే కదా , ఎలా ఉన్నావు ? "
"నిన్నటి నుండే కొద్దిగా కోలుకున్నాను . ఓ ముద్ద పెట్టండి చాలు "
అక్కడ నుండి కదిలి రెండిళ్ళ అవతల ఉన్న , పేకాట పాపారావు ఇంటిముందు అరిచాడు
" ఓ 10 రూపాయలు ఇస్తే కడుపునిండా అన్నం తింటా సార్ "
"ఇస్తాగాని , ఈ డబ్బు తో పేకాట ఆడతావో , అన్నం తింటావో గ్యారంటీ ఏమిటి "
ముక్కలు కలుపుతూ అడిగాడు పాపారావు .
"తప్పకుండా అన్నమే తింటాను సార్ , పేకాట ఆడటానికి నా జోలె లో సరిపడా డబ్బులు ఉన్నాయి " అంటూ,పాపారావు చేతిలో డబ్బులు వేగంగా తీసుకొని ముందుకు వెళ్ళాడు .
వరహాలయ్య కొట్టు ముందు ఆగాడు .వీడిని చూస్తూనే అతను
"ఇంకా బోణీ కాలేదు , వెళ్ళు , వెళ్ళు " అన్నాడు
"ఇంద , ఈ పావలా తీసుకొని , ఓ బీడీ ఇవ్వు , తరువాత ఎంత ఇస్తావో చెప్పు"
అడిగాడు పావలా తీస్తూ భి.పతి .
అక్కడ ఓ రూపాయి సంపాదించి , మరో సందు లోకి అడుగుపెట్టి ఓ ఇంటి ముందు ఆగాడు .అప్పుడే ఇంటిలో నుంచి ఎర్ర చొక్కా వేసుకొని ఓ పెద్దాయన బయటకు వచ్చి , వీడిని చూసి శకునం బాలేదని లోపలికి వెళ్లి ,మళ్ళీ 5 నిమిషాలకు బయటకు వచ్చాడు .
బిక్షపతి అక్కడే ఉన్నాడు .పెద్దాయన తప్పదని రెండు రూపాయలు ఇచ్చి ,
"అడుక్కున్నదంతా ఏం చేస్తావోయ్ " అని అడిగాడు
"తోటి బిచ్చగాళ్ళకు దానం చేస్తాను " సమాధానం చెప్పాడు భిక్షపతి .
బాగుంది...
రిప్లయితొలగించండిపేకాట ఆడటానికి నా జోలె లో సరిపడా డబ్బులు ఉన్నాయి
హ హ హ్హ