*
సెయింట్ సిండ్రెల్లా గ్రామర్ స్కూల్ స్టూడెంట్ మురుగేష్ , తన డాడీ తో కలిసి మొదటిసారి తన తాతగారి పల్లె , వెల్లటూరుకు వేసవి సెలవులకు వెళ్ళాడు.ఉదయాన్నే పెరట్లో గేదెలనుండి పాలుపితకటం చూసి అర్ధం కాక డాడీ ని,
"డాడీ ! వాళ్ళేం చేస్తున్నారు ? "
" వాళ్లు పాలు పితుకుతున్నారు "
" పాలు పాకెట్ల నుండి కదా వచ్చేది ,గేదెల లోపల పాకెట్లు ఉన్నాయా ? "
వాడికి అర్ధం అయ్యేట్లు చెప్పేసరికి సాంబశివ రావు కి తల ప్రాణం తోకకొచ్చింది.
కాసేపాగి , అటు ఇటు తిరిగి వచ్చి మురుగేష్ అడిగాడు మళ్ళీ ,
"డాడీ ! కొంచం ఎత్తుగా వెనక గోడకు అతికించి ఉన్నాయే ,అవి ఏమిటి ?"
"నాయనా , వాటిని పిడకలు అందురు .అవి పశువుల పేడతో తయారగును .
వీటితో పొయ్యి వెలిగించు కొంటాము "
"సరే డాడీ , అయితే గేదెలు , ఆవులు గోడెక్కి ఎలా పేడ వేసాయి ? "
మరోసారి విజ్ఞాన సర్వస్వం 3 వ బైండు , 16 వ పుట రీలు వేయబడింది .
అలా ఓ నాలుగు రోజులు గడిచాయి .
ఐదో రోజు పొద్దున్నే ఐదు గంటల ఐదు నిమిషాలకు డాడీ ని తట్టి లేపాడు గేష్
"డాడీ ! "కొక్కొరోకో " అని రోజూ కోడిపుంజు పొద్దున్నే అరిచి మన నిద్ర డిస్టర్బ్ చేస్తుందే ?"
"అది దాని అలవాటు బాబూ, దాని కోడి లేవకనుండే ,తను చెప్పాలనుకున్నదంతా ముందే చెప్పేస్తుంది "
:(
రిప్లయితొలగించండిమీ జోక్స్ చిన్నగా వున్నప్పుడే బావున్నాయి. ఇప్పుడు సాగతీస్తున్నారు.
రిప్లయితొలగించండిమరోసారి విజ్ఞాన సర్వస్వం 3 వ బైండు , 16 వ పుట రీలు వేయబడింది .
రిప్లయితొలగించండిఈ లైన్ చాలా బాగుంది