పుస్తకమైనా

*
ఆరేళ్ల క్రితం సరస్వతి పెళ్లి చదువుల రావు తో జరిగింది . అతనొక పుస్తకాల
పురుగు .మిర్చి బజ్జీలు ,పుణుకుల కంటే ,వాటిని కట్టిన కాగితాన్ని ఎక్కువ
ఆస్వాదిస్తాడు .

బాధ భరించలేక సరస్వతి విసుగ్గా

"నేను పుస్తకాన్నైనా బాగుండేది.కనీసం అప్పుడైనా ఎప్పుడూ నన్ను చదువుతూ
ఉండేవారు " అంది .

"నాకైతే నువ్వు కాలండర్ అయితే బాగుంటుందనిపిస్తోంది .ప్రతి సంవత్సరం
కొత్త కాలండర్ చదువుకోవచ్చు " పుస్తకంలోంచి తొంగి చూస్తూ అన్నాడు
చదువుల రావు .

1 కామెంట్‌:

  1. "మిర్చి బజ్జీలు ,పుణుకుల కంటే ,వాటిని కట్టిన కాగితాన్ని ఎక్కువ
    ఆస్వాదిస్తాడు ."

    - వ్యక్తిత్వాన్ని ఒక లైనులో బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం