*
కాకులు దూరని కారడవి,చీమలు దూరని చిట్టడవి.మూలికల వెతుకులాట లో
అందులోకి ప్రవేశించారు ఒక సైంటిస్ట్ , ఒక స్వామీజీ .మూలిక అనుకోని
ఒక తీగను పట్టుకొని పరీక్షించసాగారు .దాంతో ఆ తీగకు చివర పొదలో
పడుకొనివున్న పులికి మెలుకువ వచ్చింది .చాలా రోజులకు నరమాంసం
దొరికిందని ఆనందిస్తూ ,వాళ్ల వెనుక పడింది .
పరుగు మొదలైయ్యింది. పరుగెడుతూనే సైంటిస్ట్ లెక్కలు వేసి, స్వామి తో
"స్వామీజీ !మనం పరుగెత్తి లాభం లేదు .పులి వేగం ఎక్కువ .మనం దానికి
ఆహారమవటం ఖాయం " అన్నాడు .
అది విని స్వామీజీ "ఆ విషయం నాకూ తెలుసు .నా ప్రయత్నమంతా
నిన్ను దాటి ముందుకు వెళ్ళాలనే "
:) :)
రిప్లయితొలగించండిహ హ హ...
రిప్లయితొలగించండిtoo good :)
రిప్లయితొలగించండిgood one :)
రిప్లయితొలగించండి