చిట్టి నవ్వులు

***
ఆమె చేతి
వంట
అతను
నోరులేని మనిషి
***
నేలపై
రాలిన పువ్వు
బోసిపోయింది
ఆమె జెడ
***
కల
నిజమైంది
అతనిక
లేడు
***
అలుపెరగని
అల
ఓడిపోయిన
ఇసుక గూళ్ళు
***
ఆకాశం లో
ఎర్రని చంద్రుడు
కాన్వాసు పై
ఒలికిన సింధూరం
***

4 కామెంట్‌లు:

  1. నవ్వులాటకి రాసినట్టు లేదండి.నిజం గా బాగున్నాయి.చివరి రెండూ అయితే తెగ నచ్చేసాయి.

    రిప్లయితొలగించండి
  2. ఆకాశం లో
    ఎర్రని చంద్రుడు
    కాన్వాసు పై
    ఒలికిన సింధూరం

    .... బాగుంది

    రిప్లయితొలగించండి
  3. ఆమె చేతి
    వంట
    అతను
    నోరులేని మనిషి ..............

    ఇది భలే ఉంది. నవ్వులాటకు సరిపోయింది.
    కానీ మరీ దారుణం శ్రీకాంత్ గారూ!
    మా పరువు (ఆడవాళ్ళ) తీసేస్తున్నారు...

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం