ఈ రోజు
దసరా పులి వేషానికి ప్రాక్టీస్ చేసి ,అర్ధరాత్రి ఇంటికొస్తుంటే మా
సందు లోని గ్రామసింహం పిక్క పట్టుకుంది .
అందువల్ల చేత ఈ రోజు అంతా........... ఏడు"పులే " .
ఏకాంతంలో
వాసు , లక్ష్మి తో
"ఈవేళ మా వాళ్లందరూ వూరు వెళ్లారు. మా ఇంటి కొస్తే ఏకాంతం గా గడపచ్చు .వస్తావా ప్లీజ్ ! "
" వస్తే నన్నేమైనా చేస్తావా ? " అనుమానంగా అడిగింది లక్ష్మి .
"నామీదొట్టు ,నిన్నేం చేయను " నమ్మకంగా చెప్పాడు వాసు .
"అయితే అక్కడెందుకు ?, బిగ్ బజార్ లో కలుద్దాం '' అని విసురుగా వెళ్ళిపోయింది లక్ష్మి .
బ్లాగరి తపస్సు
ఓ బ్లాగరి దేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసాడు. ఆయన ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాడు .
"దేవా ! నేను రాసే ప్రతి టపాపై చర్చలు, కామెంట్లు ఉండేట్లు అనుగ్రహించు " కోరాడు బ్లాగరి
"నాకు బ్లాగుట రాదు.లేనిచో అవి నేనే రాయుదును. ఇతర బ్లాగర్లను లైనులో పెట్టుట నావల్ల కాదు .వేరే దేవుడిని
ట్రై చేసుకో " అంటూ మాయమైపోయాడు దేవుడు .
ఆ బ్లాగరి ఎవరు ? తెలిసి చెప్పక పోతే మీ టపాలకు కామెంట్స్ రావు .
P.S.: ఈ టపాకు 437 కాపీలు రాసి తోటి బ్లాగర్లకు పంపండి .మీ టపాలకు చూడలేనన్ని కామెంట్స్ పొందండి .
బాల స్వామి లీలలు
బాల నరసింహ స్వామి, భక్తులకు తన బాల్య లీలలను వివరిస్తున్నారు
"నా చిన్నప్పటి నుండీ నా కంటికి దగ్గరలో ఉన్న ఏ వస్తువునైనా దగ్గరకు రావాలని మూడు సార్లు గట్టిగా పలకంగానే అవి నా చేతిలో వుండేవి. "
అదివిన్న ఓ పండు ముసలమ్మ సన్నగా గొణిగింది
"ఈ కోపిష్టివాడికి ఆ వస్తువులు అందిచలేక చిన్నపుడు అమ్మగా నేను చచ్చేదాన్ని .ఇప్పుడు శిష్యులు చే(చ)స్తున్నారు,భక్తులకు తెలియకుండా."
నిదానమే ప్రధానం
పెద్ద ట్రాఫిక్ జంక్షన్ .ఉదయం 9 గంటలు. ఓ 85 ఏళ్ల ముసలాయన వేగంగా నడుస్తూ
తనకు 30 అడుగుల దూరంలో బజాజ్ పల్సర్ బైక్ పై వెళుతున్న కూర్మారావుకు ఎదురు నిలబడి అరిచాడు
"నీకు బుద్దుందా ?,ఈ టైం లో ,ట్రాఫిక్ అంతా ఆగేట్టు ఇంత నెమ్మదిగా బండి నడుపుతావా ?"
ఈ హడావిడికి తప్పదు కాబట్టి వచ్చిన ట్రాఫిక్ పోలీస్ " బైక్ పక్కన పెట్టి, ముందు
నీ లైసెన్స్ ,బండి కాగితాలు బయటకు తీయ్ " అన్నాడు .
కూర్మారావు తన లైసెన్స్ చూపించాడు . అది రోడ్ రోలర్ డ్రైవింగ్ లైసెన్స్ .
మారని పాఠం
మూడవ తరగతి చదువుతున్న రాధిక , మోనిక మాట్లాడు కుంటున్నారు .
" మనం క్లాస్ మారినప్పుడల్లా అన్ని టెస్ట్ బుక్స్ లోని పాఠాలు మారిపోతున్నాయే, కాని ఎక్కాల పుస్తకం ,అట్లాస్ లోనివి మాత్రం మారట్లేదే " అంది రాధిక .
"ఆ పుస్తకాల వాళ్లు ఎక్కువ చదువుకో లేదేమో పాపం " తన మనసు లోని మాట చెప్పింది మోనిక .
మిమ్మల్ని హింసించటానికి--నా తవిక
నా పదునాలుగేళ్ళ వయసు లో రాసిన ఈ తవికను ,నేనూ కవినే అని అనిపించుకోవాలన్న దురద తో ఇక్కడ రాస్తున్నాను . మీ తిట్టు కవిత్వాన్ని వ్యాఖ్యలలో పొందుపరచండి .
కవిత వనిత
.
కవి తలలో
వికసించి సుగంధాలు వెదజల్లే
వికసించి సుగంధాలు వెదజల్లే
తత్వం కవిత
.
వరించి
నిరంతరం పురుషుని
తరింపచేసేది వనిత
స్వామి లీలలు
చిదానంద స్వామి తన బాల్యం లో జరిగిన సంఘటనను భక్తులకు వివరిస్తున్నారు " నా పద్నాలుగో ఏట ,అడవి గుండా వెళుతున్నపుడు ఓ సింహం నన్ను తినబోయింది. అప్పుడు దైవాన్ని గట్టిగా స్మరించాను .సింహం వెంటనే
వెళ్ళిపోయింది .దీనివల్ల మీకేం తెలిసింది ? "
"దైవం కూడా పొరపాటు పడవచ్చని " సన్నగా అన్నాడు ,గత 10 ఏళ్ళుగా సప్లయి చేసిన ఏన్నో వేల వీభూతి బస్తాలకు పైసా కూడా డబ్బులు రాని ఓ వ్యాపారవేత్త .
M.P. గోల
M.P. మైకాసురరావు అరుస్తున్నాడు గట్టిగా " అధ్యక్షా ! మా ప్రాంతానికి జరిగిన అన్యాయానికి నిరసనగా నా M.P. పదవికి రాజీనామా చేస్తున్నాను "
ఇంతలో వాళ్ళావిడ పిలిచింది ఆదుర్దాగా ..
"మీ కల మండా !, కళ్లు తెరిచి T.V. లో చూడండి .రాష్ట్రపతి లోక్ సభను రద్దు చేసారు"
ఇంతలో వాళ్ళావిడ పిలిచింది ఆదుర్దాగా ..
"మీ కల మండా !, కళ్లు తెరిచి T.V. లో చూడండి .రాష్ట్రపతి లోక్ సభను రద్దు చేసారు"
పిల్ల గొడవ
మా ఆవిడ ,నేను మంచి మూడ్ లో ఉండగా చూసి మొదలు పెట్టింది
" ఏమండీ,మీరు జోక్స్ రాయటం మానేయండి బ్లాగుల్లో ."
"ఎందుకు ?" ఆశ్యర్యపోతూ అడిగాను నేను .
"మీరు నవ్వుతు,నవ్విస్తూ ఉంటే పెళ్లి కాలేదనుకొని , ఏ బ్లాగు పిల్లో వెనకబడితే,నా బతుకేం కావాలి " నిష్టూరం గా అందావిడ .
ఇష్టం
ఎన్నాళ్ళో ..... వేచిన ఉదయం
సావిత్రమ్మకు తన భర్త కంటే ముందు వెళ్ళాలని గట్టి కోరిక .
కొద్ది రోజులు గా భర్త ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు .
నెల రోజుల తర్వాత ఆమె కోరిక తీర్చుకుంది " చిరంజీవి కొత్త సినిమా మొదటి రోజు మార్నింగ్ షో కు వెళ్లి"
అది ఆమె భర్త పోయిన 13 వ రోజు .
పిచ్చి కారణం
సునీల్ ,పిచ్చాసుపత్రి పెద్దడాక్టర్ బ్రహ్మానందం ను బతిమాలుతున్నాడు .
"సార్,నాకు ఇద్దరు పేషెంట్ల వివరాలు కావాలి. వారితో నేను మాట్లాడాలి ."
" ఎందుకు"
"వాళ్లకు పిచ్చి ఎలా ఎక్కిందో తెలుసుకోవటం నాకు చాలా అవసరం సార్ "
"వాళ్లు నీకే మౌతారు ?"
"ఏమీ కారు ,మా ఆవిడ వేపు చుట్టరికం సార్ "
" ఆవిడకు ఎలా "
"ఒకరు ఆమె మాజీ భర్త ,మరొకరు పాత ప్రియుడు "
శాపం
విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేస్తున్నాడు .భగ్నం చేయటానికి రంభను పంపాడు ఇంద్రుడు .కాలం గడుస్తోంది .రంభ నుండి సమాచారం లేదు.
విషయం తెలుసుకోవటం కోసం స్వయంగా బయలుదేరాడు.
రంభ తీవ్రంగా తపస్సు చేస్తూ కనిపించింది .
"ఆయన తపస్సు చెడగొట్టమని పంపితే ,నువ్వు చేస్తున్నావేమిటి ?" ఆగ్రహించాడు ఇంద్రుడు .
"తపశ్శక్తి చేత శాపమిచ్చి ,ఆయన తపస్సు చెడగోడదామని " వినయం గా బదులిచ్చింది రంభ.
విషయం తెలుసుకోవటం కోసం స్వయంగా బయలుదేరాడు.
రంభ తీవ్రంగా తపస్సు చేస్తూ కనిపించింది .
"ఆయన తపస్సు చెడగొట్టమని పంపితే ,నువ్వు చేస్తున్నావేమిటి ?" ఆగ్రహించాడు ఇంద్రుడు .
"తపశ్శక్తి చేత శాపమిచ్చి ,ఆయన తపస్సు చెడగోడదామని " వినయం గా బదులిచ్చింది రంభ.
బ్లాగు సన్యాసం
ఓ బ్లాగరి తన మిత్రునితో ఇలా వాపోయాడు "నేను ఎంత మంచి టపాలు రాసినా ,కొందరు బ్లాగర్లు నా టపాలపై చెత్త కామెంట్ల తో టపాలు రాస్తున్నారు .కొందరైతే టపాలు రాయటం మానేయమని ,లేకపోతే బ్లాగు యముడు నన్ను పట్టుకు పోతాడని శాపనార్ధాలు పెడుతున్నారు .దాంతో చాలా బాధపడి మానేసాను రా నేను ."
"మానేశావా ?" నమ్మలేనట్లు అడిగాడు మిత్రుడు .
"అవున్రా , మానేసాను "వారి బ్లాగులు చూడటం " "
"మానేశావా ?" నమ్మలేనట్లు అడిగాడు మిత్రుడు .
"అవున్రా , మానేసాను "వారి బ్లాగులు చూడటం " "
ఈ .....................వేళ
ఇల్లలుకుతూ ఈగ తన పేరు మర్చి పోయింది .
వేట కెళ్ళి తెచ్చిన ఏడో చేప ఎండలేదు .
అందుచేత ఈ వేళ ఏమీ రాయలేదు .
మీకు కల్గిన ఈ సౌకర్యానికి ఆనందిస్తున్నాము .
పాపం భార్య

అంతా విని S.I. అడిగాడు "20 రోజుల నుండి కనిపించక పోతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావేమిటీ?"
" ఈరోజు పొద్దున్నే ఇంట్లో బియ్యం ,పప్పులు అయిపోయాయి సార్ " అన్నాడు బకాసుర రావు
జీవిత రేఖ

క్రాంతికుమార్ , విశ్వనాథ్ హైవే మీద బఠానీలు తింటూ నడుస్తున్నారు .వెనకనుండి లారీ ఒకటి వేగంగా వస్తోంది .క్రాంతికుమార్ కంగారు గా "విశ్వం, తొందరగా పక్కకు రారా " అన్నాడు. విశ్వనాథ్ నవ్వి తన కుడిచేయి చూపిస్తూ " నా చేయి చూడరా ! , జీవితరేఖ జెర్రిగొడ్డు లా బ్రహ్మాండం గా ఉంటేను ."
" నీ చేతిలో రేఖ నీకు ,నాకు కనిపిస్తోంది కాని , లారీ డ్రైవర్ కు కనిపించదు కదా " అంటూ పక్కకు లాగాడు క్రాంతికుమార్ విశ్వనాథ్ ని .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)