దేవుడి తొందర

*
టీవీలు చూడటం ,బ్లాగులు రాయటం ,చాట్ చేయటం,పబ్ కెళ్ళటం ఆపి ,
హటాత్తుగా మన్మధరావు తలకిందులు గా తపస్సు చేసాడు .

ఇంత చేసిన తరువాత , కనపడక పోతే బాగోదని, దేవుడు ప్రత్యక్షమయ్యాడు.

" భక్తా ! ఏమి నీ కోరిక ? "

" మీరొచ్చారేమిటి స్వామీ !" .

దేవుడు కంగుతిన్నాడు.అయినా సద్దుకొని

"తొందరగా విషయం తేల్చు ,ఇంకా పది చోట్ల కెళ్ళాలి "
మళ్ళీ అడిగాడు సౌమ్యం గా

"మీరు మరీ తొందర పడ్డారు .రంభ నో ,మేనకనో పంపితే
ఎంజాయ్ చేద్దామనుకున్నా ముందు " నసిగాడు మన్మధరావు .

6 కామెంట్‌లు:

  1. హాయ్ జోకు బాగుంది :)
    మీరు ప్రస్తుత నివాసం విజయవాడేనా?
    నా విజయవాడ ఫొటోలు చూశారా?
    http://pratibimbamu.blogspot.com/
    అందులో విజయవాడ టేగ్ మీద నొక్కండి.

    రిప్లయితొలగించండి
  2. కొత్తపాళీ గారు,

    నేను విజయవాడ వాసినే.మీ విజయవాడ ఫొటోలు బాగున్నాయి.మీ కెమేరా కన్ను మా ఊరి ఎండల్లా చాలా షార్ప్ గా ఉంది .

    రిప్లయితొలగించండి
  3. ఇక్కడేదో మా 'వాడ' గురించి చర్చ జరుగుతున్నట్లుంది!

    జోక్ బావుందండి..:-)

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. మొదటాగా జోకు కత్తి

    ఏంటీ అందరూ నన్ను మరచి పోయారు. మనది విజయవాడ

    నేను కొత్తపాళీ గారిలా ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోయినా
    విజయవాడ లో ని దాదాపు అన్ని ప్రదేశాలు ఓ చోటపడాదామని ప్రయత్నిస్తున్నాను.

    కుదిరితే ఇది కూడా ఛూడండి.

    ఇంకా చాలా అప్ డేట్ చెయ్యాలి .

    http://view-vijayawada.blogspot.com/

    రిప్లయితొలగించండి
  6. చాలా మంది వీజయవాడ వాళ్ళు చేరారే! :)
    శ్రీకాంత్. నాకు ఒక మెయిల్ చెయ్యండి. టచ్ లో ఉందాం.
    kottapali at gmail dot com

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం