*
మణిరత్నం బుర్ర మీసాలతో ,ఎర్ర కన్నులతో ఒక చిన్న సైజు రాక్షసుడిలా ఉంటాడు.
రమా బాల విద్యా మందిరం పిల్లల దురదృష్టం కొద్దీ , ఆయన వాళ్ళకి టీచరుగా
వచ్చాడు . ఒక రోజు క్లాసులో ,
" నేను నాస్తికుడిని. మీరు కూడా నాస్తికులేనా ? " అడిగాడు గంభీరమైన గొంతుతో
పిల్లల్ని .
పిల్లలకి నాస్తికుడు అంటే ఏమిటో తెలియదు .తాము కాదంటే ఏమంటాడో అని భయం.దాంతో
అందరి చేతులు ఒక్కసారిగా నింగికెగసే తారాజువ్వలలా పైకి లేచాయి . ఒక్క పిల్లవాడు
మాత్రం చెయ్యి ఎత్తలేదు .మణిరత్నం అడిగాడు వాడిని ,
" హరీ !నువ్వు నాస్తికుడివి కాదా ? "
" లేదు నేను నాస్తికుడిని కాదు , నేను హిందువుని "
" నువ్వు హిందువు వి ఎట్లా అయ్యావు ? "
" మా అమ్మ , నాన్న హిందువులు . వాళ్ళకి నేను పుట్టాను కాబట్టి హిందువునే "
" అది సరి కాదు . మరి మీ అమ్మ మూర్ఖురాలు,మీ నాన్న మూర్ఖుడు అయితే,
నువ్వు మూర్ఖుడివి అవుతావా ? " గద్దించాడు మణిరత్నం
" కానండి , అప్పుడు నేను నాస్తికుడిని అవుతాను " చెప్పాడు తొణక్కుండా హరి
LOL! Good One!
రిప్లయితొలగించండి_______________________________________________
రిప్లయితొలగించండి" అది సరి కాదు . మరి మీ అమ్మ మూర్ఖురాలు,మీ నాన్న మూర్ఖుడు అయితే,
నువ్వు మూర్ఖుడివి అవుతావా ? " గద్దించాడు మణిరత్నం
" కానండి , అప్పుడు నేను నాస్తికుడిని అవుతాను " చెప్పాడు తొణక్కుండా హరి
________________________________________________
LOL :)
సూపర్, జోక్ తో పాటుగా మంచి మెస్సేజ్ ఉంది :)
రిప్లయితొలగించండిఇంకా నయ్యం మీలాంటి టీచర్నవుతాననలేదు
రిప్లయితొలగించండికుక్క కాటుకు చెప్పుదెబ్బ
రిప్లయితొలగించండిఅంటే నాస్తికుల తల్లిదండ్రులందరూ మూర్ఖులంటారా????
రిప్లయితొలగించండి