నవ్వులాట సాధించెన్ అరుదైన ఘనత

*
నేను నవ్వులాట గా జులై 2008 లో మొదలు పెట్టిన ఈ బ్లాగు నిన్నటి



రోజున ఒక అరుదైన ఘనతని తన సొంతం చేసుకొంది.ఈబ్లాగులో నేను

03- అక్టోబర్ -2008 నుండీ నిన్నటి వరకు ఒక్కరోజు కూడా

విడువకుండా ఒక సంవత్సరకాలం ప్రతి రోజూ జోకులతో నా బ్లాగులో

టపాలని రాస్తూ వచ్చాను. నాకు తెలిసినంత వరకు ఈప్రపంచంలో ఒక

సంవత్సరకాలం ఆపకుండా తెలుగుబ్లాగులలో టపాలను రాసిన

మొదటివ్యక్తిని నేనే.

బహుశా మిగిలిన భారతీయ భాషలలో చూసినా,నేను మొదటి


నలుగురిలో ఉంటాననే అనుకుంటున్నాను.

ఈ నా బ్లాగు ఘనత నాది మాత్రమే కాదు,



నా బ్లాగు రోజూ చదివే మీ అందరిది.

మీ ప్రోత్సాహం లేకుంటే ఇది సాధ్య మయ్యేది కాదు.


నా అర్ధాంగి అన్నపూర్ణ,నా చిన్నారులు చిన్మయీ,హరి సహకారం


లేనిదే ఈ నాయాత్ర నిజంగా సఫలమయ్యేదే కాదు.

మీ అందరి అభిమానాన్ని,ఆదరణని,ఆశిస్సులను ఎల్లపుడూ కోరుకుంటూ,




మీ

నవ్వులాట శ్రీకాంత్

25 కామెంట్‌లు:

  1. అభినందనలు. నవ్వుతూ నవ్విస్తూ ముందుకు సాగండి.

    రిప్లయితొలగించండి
  2. మీ ఆట ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  3. శ్రీకాంత్ గారూ,
    హృదయపూర్వక అభినందనలు. మీరిలాగే ఏళ్ళ తరబడి నిరాటంకంగా మీ నవ్వులాటని సాగించాలని, ప్రతీరోజూ మాకందరికీ నవ్వుల్ని పంచాలనీ కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  4. అభినందనలు శ్రీకాంత్ గారు :)

    నేను మీ బ్లాగు ని దాదాపు ప్రతి రోజూ చూస్తూ ఉంటాను. నాకు నచ్చిన బ్లాగుల్లో మీదొకటి :) మీరు ఇలాగే ఎన్నో జోకులు ప్రతి రోజూ అందించాలని కోరుకుంటున్నాను. మీకు ఎంతో సహకారం అందిస్తున్న మీ శ్రీమతిగారికి ప్రత్యేక అభినందనలు :)

    రిప్లయితొలగించండి
  5. నవ్వించడమనే మీ యోగాన్ని ఇలా నిరంతరం సాగించండి .

    రిప్లయితొలగించండి
  6. ఇది నిజంగా గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్. కంగ్రాట్స్. వీలైనప్పుడల్లా మీ 'నవ్వులాట ' చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాను.

    రిప్లయితొలగించండి
  7. నమస్కారం శ్రీకాంత్ గారు,
    ముందుగా అభినందనలు. నవ్వుల నెలరాజు జంధ్యాల గారు పుట్టిన ఊరులో పుట్టిన మీరు బ్లాగ్ లోకంలో నవ్వుల వెన్నెలలు కురిపిస్తున్నారు.... ఈ నవ్వుల వర్షం ఇలాగే కురుస్తుందని ఆశిస్తూ....

    భవదీయుడు,

    సతీష్ కుమార్ యనమండ్ర

    రిప్లయితొలగించండి
  8. దంచేసారండి. కేక!! కేవ్!!

    రిప్లయితొలగించండి
  9. మీకు నా అభినందనలు. మన విజయవాడ వాళ్ళ దమ్ము చూపించారు. మీరిలాగె ఇంకా ఇంకా ఎన్నొ ఎన్నెన్నో వసంతాలు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ నవ్వుతూ .........

    రిప్లయితొలగించండి
  10. ప్రియ శ్రీకాంత్. అభినందనలు.
    చ:-
    తరగని నవ్వులాట నిరతంబు జనాళికి నందఁ జేయుచున్
    సరస సుఖానుభూతి ఘనసార పరీమళ సార యుక్తి నం
    దరికి నొసంగు మీ కృషియె తప్పక గిన్నిసు బుక్కుకెక్కు. సో
    దరుడ! సుఖంబు నొంది, సుఖ తత్వమె విత్తము కాగ వెల్గుమా!

    శుభాశీశ్శులతో
    చింతా రామకృష్ణారావు.
    ఆంధ్రామృతం.

    రిప్లయితొలగించండి
  11. చాలా సంతోషం.
    మీ జోకులు తరచూ చదువుతూంటాన్నేను. ఇదివరకెక్కడా విననివి, చదవగానే నవ్వు పుట్టిస్తుంటాయి. ఇదివరకు విన్నవి కూడా మీరు చెప్పే విధానం ఆసక్తికరంగా ఉంటు ఉన్నది.

    మీరు పట్టు విడవకుండ సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు. అనేకానేక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. navvechatam nijamgaa oka kala.. you are realy great sreekanth garu . keep going...... all the best

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం