ఇద్దరు సన్నాసులు

*
ఇద్దరు ముసలి సన్నాసులు తమ అనుభవాలను పంచుకొంటున్నారు .

"నేను జీవితం లో ఎవరి సలహాలు వినక ఇలా అయ్యాను "
బాధపడ్డాడు ఓ సన్నాసి .

"అందరి సలహాలు వినే నేనిట్టా అయ్యాను " నిజం చెప్పాడు మరో సన్నాసి .

3 కామెంట్‌లు:

  1. చిన్నగా చెప్పినా చక్కగా చెప్పారు సన్నాసుల్ని గూర్చి.
    వెనుకటికి బద్దెన ఒక పద్యం చెప్పాడు. గుర్తుందా!
    కందము:-
    వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతనె వేగ పడక వివరింపదగున్.
    కడకెల్ల నిజము తెలిసిన
    మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ.

    సంస్కృతంలో ఒక నానుడి వుంది
    ఆత్మ బుద్ధిః సుఖంచైవ. అని.

    ఎవరి మాటా వినకపోవడం తప్పే, వినేసి వారు చెప్పినట్లుగా వివేచనా రహితంగా ఆచరించడమూ తప్పే. తనకు తానుగ ఆలోచించుకొనే శక్తిని కలిగి వుండాలి. చాలా బాగా చెప్పిన మీకు అభినందనలు.
    జైహింద్.

    రిప్లయితొలగించండి
  2. జోక్ అయినా గానీ.. చాలా మంచి విషయం చెప్పారు :)

    రిప్లయితొలగించండి
  3. చెప్పుడు మాటలు విని చెడిపోకు అన్నారు. అసలు ఎవ్వరి మాటా వినకపోయినా నెగటివ్ పరిణామాలు ఎదురవుతాయి.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం