దుర్గా రావు ఎంతో ముచ్చటపడి బాగా మాట్లాడే చిలకను కొన్నాడు .దాన్ని ఇంట్లో పెట్టి పని మీద బయటకు వెళ్లి వచ్చాడు. భోజనం చేస్తుంటే చిలక జ్ఞాపకం వచ్చింది .భార్యను అడిగాడు .
"మీరు ఇప్పుడు తింటున్నది దాని కూరేనండీ " అంది భార్య .
"ఎంతపని చేసావే ?, దానికి పదహారు భాష లొచ్చు." అరిచాడు కోపం,బాధ కలసిన గొంతుతో దుర్గారావు .
" ఆమాట దాన్ని పట్టుకొని కోసేటప్పుడు ఏ ఒక్క భాషలోనైనా చెప్పిచావలేదే మరి !" అడిగింది ఆశ్చర్యంగా అతని భార్య.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం