పానకాల రావు తప్పతాగి తూలుతూ అర్ధరాత్రి ఓ ఇంటి తలుపు కొట్టాడు . తలుపు తెరుచుకోలేదు . "ఏమే ! మొగుడొస్తే తలుపు తీయవేంటే, ఎక్కడ చచ్చావు " అరిచాడు .ఆ ఇంటి ఇల్లాలు ఓరగా తలుపు తీసి, " ఇది మీ ఇల్లు కాదు, గొడవ చేయకుండా వెళ్ళండి " అంటూ తలుపు వేసేసింది .
ఇదంతా చూస్తున్న ఆమె నాలుగేళ్ల పాప "అమ్మా , నాన్న కు అలా అబద్దం చెప్పి తలుపు వేసేసా వేమిటి " అని అడిగింది .
" ఓ 3 గంటలాగి మత్తు దిగిం తరువాత వస్తాడులే , మనం అప్పడిదాకా హాయ్ గా పడుకోవచ్చు " అంది ఆ ఉత్తమ ఇల్లాలు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం