నా ప్రపంచం ---10,000 హిట్స్

నా ప్రపంచం 10,000 హిట్స్ సాధించటం చాలా మంచిదే . కాని 10,000 వ పాఠకుడు అదృష్ట వంతుడు అని అన్నారు C.B.RAO గారు. అదృష్టాన్ని వారు నమ్ముతున్నారన్న మాట. మిగిలిన 9,999 హిట్స్ ఇచ్చిన వారు ఏమిటి ? .అనుకోకుండా జరిగిన విషయాలు మన కొలబద్ద తో చూడటం వల్ల అదృష్ట, దురదృష్ట లని పేరు పెడతాం .ఇలాంటి కొన్ని వేల విషయాలు కొన్నాళ్ళకు ఆచారంగా , మతం గా మారిపోతాయి .కొన్ని సంకేతాలు ఏర్పడతాయి . మూఢనమ్మకాలను వదిలించే బ్లాగు కు కూడా " అదృష్టం" పట్టింది .అందువల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే ఎల్లపుడు మనిషి rational గా ఉండటం సాద్యం కాదు. కొంత వింత ,వినోదం కూడాఅవసరమే. అవి మన ప్రగతి కి అడ్డు పడనంతవరకు .

9 కామెంట్‌లు:

  1. అదిరింది. దీన్ని గనక చదివున్నట్లయితే, ఇన్నయ్యగారికి బుర్ర తిరిగిపోయుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. కెవ్వు కేక .. సూపర్ ... డూపర్ .. అదిరింది.

    ఏమిటో అబ్రకదబ్ర గారు .. లేనివి, ఉన్నాయనుకున్నా ఎప్పుడో ఒకటి రెండు విషయాలకి పనిచేస్తున్నవి .. తిరగటమేమిటో, పోవటమేమిటో ...

    రిప్లయితొలగించండి
  3. జోకు అదిరింది. కేక. ఇంకోటి చెప్పనా. శ్రీకాకుళం లో కమ్యూనిస్టులు అనేవారు (?) " ఈ పీడిత ప్రజల కోసం మేమెంత కష్టపడ్డామో, మాకు తెలుసు, ఇంకా పైనున్న వాడికి (God) తెలుసు." మనిషి ఎంత హేతుబధ్ధంగా సిద్ధాంతాలు చేసినా, కొన్ని పొరబాట్లు అలా జరుగుతుంటాయి. దీనికి కారణం చుట్టూ ఉన్న, సామాజిక పరిస్థితులు, ఆలోచనలపై కలిగించే ప్రభావం కావచ్చు. ఉదాహరణగా గద్దర్, భద్రాద్రి రాముని వేడుకోవటం చెప్పవచ్చు.

    మాకు ఈ word verification పరీక్ష తప్పదా?

    రిప్లయితొలగించండి
  4. రావు గారు,
    శ్రీకాంత్ గారి జోకుతో పాటు మీరు చెప్పిన జోకు కూడా అదిరింది. నవ్వకుండా ఉండలేకపోయాను.

    రిప్లయితొలగించండి
  5. రావు గారూ,

    మీరు దీనిని ఎలా తీసుకుంటారో అనుకున్నాను. స్పోర్టివ్ గా తీసుకున్నందుకు సంతోషం వేసింది.

    రిప్లయితొలగించండి
  6. హహహ... భేష్, మీ సూక్ష్మ దృష్టి అదిరింది.

    రిప్లయితొలగించండి
  7. భలె! భలే పట్టారు.

    అయితే.. ఇది పొరపాటులాగా అనిపించినా.. పొరపాటు కాదు, సహజం! మనిషి ఎన్ని సిద్ధాంతాలను లేవదీసినా, సంస్కృతి నుండి దూరం కాలేడు. కాకూడదు కూడా!

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం