భోజనం

*
ఆదివారం ఉదయాన న్యూస్ పేపర్ చదువుతూ ఆదినారాయణ పెరట్లోని భార్యతో అరిచి చెప్పాడు,

"ప్రియా ! ఇవాళ మా కొత్త కొలీగ్ చిరంజీవిని మనింటికి మద్యాహ్నం భోజనానికి పిలిచానే "

అదివిన్న శ్రీప్రియ వరండా లోకి ఉరికి భర్తతో అంది ,

" ఎవరి నైనా భోజనానికి పిలిచేముందు నాతో ఒక ముక్క ముందే చెప్పమన్నానా ,లేదా ?

ఇల్లు చూశారా , ఎంత దరిద్రం గా ఉందో , ఇల్లంతా విడిచిన బట్టలు , సింక్ లో అంట గిన్నెలు ,
రంగి రాక మూడు రోజులయ్యింది, ఇంట్లో కురలేవీ లేవు .అసలే పని తెమలక చస్తుంటే
ఈ తద్దినం తెచ్చి పెట్టారు మీదకి "

"తెలిసే పిలిచాను , ఆ వెధవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు,చూసి మారతాడని "

2 కామెంట్‌లు:

  1. హన్నా....ఎంతమాటనేసారు!
    అవునూ మీ నవ్వుల బ్లాగుల్లో చేరాలంటే ఏం పాసవ్వాలండి?
    ఒకటో, మూడో ,పదో నవ్వులు మేమూ పూయించాము కావాలంటే మా బ్లాగుకెళ్ళి చూసుకోండి

    రిప్లయితొలగించండి
  2. మీ జోకుల్లో, పాత్రల పేర్లు కూడా, చాలా సెలెక్టివ్ గా పెడతారు. ఆదినారాయణ రావు, చిరంజీవి :)
    మీ జోకు కూడా బాగానే పేలింది !

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం